యేసు బెత్లహెం అను యూదా ప్రాంత పల్లెలో మరియ, అను కన్యకకు, పరిశుద్దాత్మ వలన జన్మించాడు. గబ్రియేలు దేవదూత మరియను దర్శించి దేవుడు మరియను తన కుమారునిగర్భమునందు మోయుటకు ఎన్నుకొన్నాడని తెలిపాడు.(లూకా 1:26–38). కైసర్ ఔగుస్తుస్ ఆజ్ఞ వలన యోసేపు మరియలు నజరేతును విడిచి యోసేపు పితరుడైన దావీదు యొక్క గ్రామమైన బెత్లెహేము కు తమ పేర్లను జన సంఖ్యలో వ్రాయించుకొనుటకు వెళ్ళారు.యేసు జన్మించినపుడు సత్రంలో వారికి స్థలము లేనందున పశువుల తొట్టె లో యేసును పరుండ బెట్టారు. (లూకా 2:1–7). లూకా సువార్త ప్రకారం, దేవ దూత యేసు జన్మించిన వార్తను గొల్లలకు యాదవులకు తెలిపింది. అది విన్న ఆ గొల్లలు యేసును చూచి ఆ వార్తను ఆ ప్రదేశమంతట ప్రచురించారు."జ్ఞానులు" ఆకాశములో ఉదయించిన వింత నక్షత్రం వంక చూస్తూ వచ్చి యేసును దర్శించి తమ విలువైన బహుమతులను యేసుకు సమర్పించారు. మెస్సియా, లేదా యూదుల రాజు, పుట్టాడని గ్రహించారు.(మత్తయి 2:1-12) యేసు పుట్టిన పిదప వారు దూతచెప్పినట్లు ఈజిప్టు కు పారిపోయారు. యేసు బాల్యం గలలియ లోని నజరేతులో గడిచింది.యోసేపు మరియలు ఆ తరువాత తిరిగి నజరేతుకు వచ్చి అక్కడ నివసించారు.వారి కుటుంబం హేరోదు మరణ పర్యంతం ఈజిప్టు నందు నివసించారని వ్రాయబడి ఉంది. (మత్తయి|2:19-23|మత్తయి 2:19-23).ఈజిప్టుకు పారిపోవుటతూరు మరియు సీదోనులకు వెళ్ళుట మినహా, యేసు జీవితంలోని అన్ని సంఘటనలు ఇశ్రాయేలు , యూదా ప్రాంతములయందే జరిగినవి. [6]యేసు ముప్పది యేండ్ల ప్రాయము వాడైనప్పుడు బాప్తీస్మము పొందెను. యేసు బాప్తీస్మము పొందుటకు ముందు ఆయన బాల్యానికి మధ్య ఒక సారి దేవాలయములో కనబడుట తప్ప మరి యెప్పుడు ఆయన గురించి ఏ సువార్తలోను ప్రస్తావించ బడలేదు. (లూకా|2:41-52|లూకా 2:41–52).యేసు వడ్రంగి (మార్కు|6:3), వడ్రంగి వాని కుమారునిగా పిలువ బడ్డాడు.(మత్తయి|13:55),కాబట్టి యేసు వడ్రంగం పని చేసి ఉంటాడు. 'యేసు బాప్తీస్మము పొందటం , శోధనను జయించటం.' యేసు యోహాను ద్వారా బాప్తీస్మము పొందడం యేసు యొక్క పరిచర్య ప్రారంభం.యోర్దాను నదిలో ప్రజలకు బాప్తీస్మమిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యోహాను యొద్దకు యేసు బాప్తీస్మము పొందడానికి వచ్చాడు."తన యొద్దకు బాప్తీస్మము పొందడానికి వచ్చిన యేసును చూసిన యోహాను తనకు యేసునే బాప్తీస్మమిమ్మని అడిగితే , యేసు ఇప్పటికి నీతి నెరవేరునట్లుగా తనకు యోహానునే బాప్తీస్మమిమ్మని" అడిగాడు. యేసు బాప్తీస్మము పొంది నీటి నుండి లేచినప్పుడు, ఆకాశము తెరుచుకొని,దేవుని ఆత్మ పావురము వలే దిగివచ్చింది. "ఇతడు నా ప్రియ కుమారుడు. ఇతని యందు నేనానందించు చున్నాను" అని పరలోకము నుండి ఒక స్వరము వినబడింది. బాప్తీస్మము పొందాక యేసు అరణ్యములో 40 రోజులు ఉపవాసమున్నాడు.ఈ సమయంలో సాతాను యేసును శోధిస్తాడు.యేసు దేవుని వాక్యాలు చెప్పి సైతానును జయిస్తాడు.అప్పుడు సాతాను యేసును విడిచి పోతాడు. దేవ దూతలు వచ్చి యేసుకు ఉపచారాలు చేస్తారు.
సేవ[మార్చు]
ప్రధాన వ్యాసంs: యేసు పరిచర్య, కొండమీద ప్రసంగం, మైదానములో ప్రసంగం, పన్నెండు మంది శిష్యులు, and యేసు రూపాంతరము పొందుట
యేసు మెస్సియ, "అనేకమంది ప్రాణవిమోచన క్రయ ధనంగా ప్రాణాన్ని అర్పించటానికి , "దేవుని రాజ్య సువార్తను ప్రకటించటానికీ వచ్చాను అని ప్రకటించాడు.[7]ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు.
మరణం[మార్చు]
యేసును సిలువమీద ఉంచి, అపహసించిన తరువాత మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటల దాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. సుమారు మూడు గంటలప్పుడు యేసు బిగ్గరగా, "ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?" అని కేకవేశాడు.ఏలీ అనే అరమిక్ పదం ఏలోహిం ,ఇలాహ్ అనే హెబ్రూ అరబిక్ పదాలకు సమానం. అంటే "నా దేవా ! నాదేవా నన్నెందుకు చేయి విడిచావు? అని అర్థం. అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, "అతడు ఏలియాను పిలుస్తున్నాడు" అనుకున్నారు.మత్తయి 27:45-50…
పునరుత్థానము[మార్చు]
యోనా తిమింగలం కడుపులోనుండి సజీవంగా బయటపడినట్లు,మనుష్యకుమారుడు (యేసు ) చనిపోయి మూడవరోజున తిరిగి లేస్తాడు. ఆయనే మెష్షయాఅనటానికి అదే ఒక సూచన అని యేసు చెప్పాడు. ఈ పునరుత్థానాన్ని మరణంపై యేసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు.
యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన[మార్చు]
"పరలోకమందున్న మా తండ్రీ,నీనామము పరిశుద్ధపరచబడుగాక.నీరాజ్యమువచ్చుగాక.నీచిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.మా అనుదినాహారము నేడుమాకు దయచేయుము.మా ఋణస్థులను మేముక్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.మమ్మును శోధనలోకి తేక కీడునుండి మమ్ము తప్పించుము.రాజ్యము బలము మహిమయు నీవై యున్నవి.ఆమెన్" (మత్తయి 6:10-13)
No comments:
Post a Comment