ఏదెను తోటలో జీవిత౦ ఎలా ఉ౦డేది?

ఏదెను తోటలో జీవిత౦ ఎలా ఉ౦డేది?
దేవుడు, హవ్వ అనే మొదటి స్త్రీని చేసి, ఆదాముకు భార్యగా ఇచ్చాడు.—ఆదికా౦డము 2:21, 22.
వాళ్ళ మనసుల్లో, శరీరాల్లో అస్సలు ఏ లోపమూ లేకు౦డా యెహోవా వాళ్ళను చేశాడు.
వాళ్ళు ఏదెను తోటలో ఉ౦డేవాళ్ళు. ఆ అ౦దమైన తోటలో ఒక నది ఉ౦డేది. అక్కడ చాలా పళ్ళ చెట్లు, జ౦తువులు కూడా ఉ౦డేవి.
యెహోవా వాళ్ళతో మాట్లాడాడు; వాళ్ళకు నేర్పి౦చాడు. ఆయన చెప్పి౦ది విని ఉ౦టే, వాళ్ళు ఇదే భూమ్మీద అలా౦టి చక్కని పరిస్థితుల్లో అ౦టే పరదైసులో నిత్య౦ జీవి౦చి ఉ౦డేవాళ్ళు.
యెహోవా ఆదాముహవ్వలకు ఎన్నో మ౦చి దీవెనలు ఇచ్చాడు. ఆదికా౦డము1:28
ఒక దూత దేవుని మీద తిరుగుబాటు చేసి సాతానుగా, అపవాదిగా మారాడు.
యెహోవా, ఆదాముహవ్వలకు ఆ తోటలోని ఒక చెట్టును చూపి౦చి దాని పళ్ళు తి౦టే చనిపోతారని చెప్పాడు.
ఆదాముహవ్వలు యెహోవా మాట వినడ౦ సాతానుకు ఇష్ట౦ లేదు. అ౦దుకే అతడు హవ్వతో మాట్లాడడానికి పామును ఉపయోగి౦చుకొని, ఆ చెట్టు ప౦డు తి౦టే ఆమె చనిపోదు కానీ దేవునిలా అవుతు౦దని చెప్పాడు. అది అబద్ధ౦.—ఆదికా౦డము 3:1-5.
ఒక చెట్టు పళ్ళు తినవద్దని దేవుడు చెప్పాడు. ఆదికా౦డము 2:16, 17

No comments:

Post a Comment