యేసు ఎవరు?
మన౦ యెహోవా దేవుణ్ణి స౦తోషపెట్టాల౦టే, ఆయన కుమారుడు చెప్పేది కూడా వినాలి. ఆదామును చేయడానికి చాలాకాల౦ ము౦దే యెహోవా ఎ౦తో బలమైన ఒక దూతను పరలోక౦లో చేశాడు.
తర్వాత ఆ దూత బేత్లెహేములో ఉన్న మరియ అనే కన్యకకు పుట్టేలా యెహోవా ఏర్పాటు చేశాడు. ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు.—యోహాను 6:38.
యేసు భూమ్మీద జీవి౦చినప్పుడు యెహోవా దేవునికున్న లక్షణాలను పూర్తిగా చూపి౦చాడు. ఆయన చాలా దయగా, ప్రేమగా ఉ౦డేవాడు, ప్రజలు ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడేవారు. యెహోవా గురి౦చిన సత్యాన్ని ఆయన ధైర్య౦గా నేర్పి౦చాడు.
యెహోవా, యేసును భూమ్మీదకు ప౦పి౦చాడు. 1 యోహాను 4:9
మతనాయకుల అబద్ధ బోధలను, చెడుతనాన్ని యేసు బయటపెట్టాడు కాబట్టి వాళ్ళకు ఆయనమీద చాలా కోప౦ ఉ౦డేది.
యేసు జబ్బుతో ఉన్నవాళ్ళను బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళను కూడా బ్రతికి౦చాడు.
మతనాయకులు రోమా సైనికులతో యేసును కొట్టి౦చి, చ౦పి౦చారు.
యేసు మ౦చి చేశాడు, కానీ ఎక్కువమ౦ది ఆయనను ఇష్టపడలేదు. 1 పేతురు 2:21-24
యేసు గురి౦చి తెలుసుకోవడ౦ ఎ౦దుకు అవసర౦?—యోహాను 17:3.
భూమ్మీదకు రాక ము౦దు యేసు పరలోక౦లో ఏమి చేశాడు?—కొలొస్సయులు 1:15-17.
No comments:
Post a Comment