యేసు వంశము-కుటుంబము[మార్చు]
ప్రధాన వ్యాసం: యేసు వంశము
మత్తయి మరియు మార్కు సువార్తలలో యేసు యొక్క వంశ వృక్షం వివరించబడంది.మత్తయి సువార్త యందు యేసు తండ్రియైనయోసేపు యొక్క పితరుల గురించి వివరించబడింది; లూకా సువార్తలో యేసు తల్లిదండ్రుల ఇద్దరి వంశ వృక్షాలున్నాయి.యేసు తల్లియైన మరియ.[3] యొక్క పితరుల వివరాలున్నాయి.యేసు యొక్క వంశ మూలపురుషులు రాజైన దావీదు మరియుఅబ్రహాము.అబ్రహాము నుండి దావీదు వరకు ఉన్న మూల పురుషుల జాబితాలో యే విధమైన మార్పు ఉండదు గాని,దావీదు నుండి యోసేపు వరకు వ్రాయబడిన మూల పురుషుల జాబితాలో తేడా కనిపిస్తుంది.మత్తయి సొలోమోను తో ప్రారంభించి యూదా గోత్రములోని చివరి రాజైన యెకోన్యావరకు ప్రస్తావిస్తాడు. యెకొన్యా తరువాత రాజుల వంశ పరంపర బాబిలోన్ యూదాను జయించుటతో ఆగిపోతుంది.లూకా వ్రాసిన వంశవృక్షము అబ్రహాము కంటే ముందున్న ఆదాము-హవ్వ లవరకు సాగుతుంది.యోసేపు పేరు యేసు బాల్యదినముల ప్రస్తావనలో మత్రమే వినిపిస్తుంది. యేసు తల్లియైన మరియను తన ప్రియ శిష్యుడు యోహాను కు అప్పగించడాన్ని బట్టి యేసు తన సేవను ప్రారంభించుటకు మునుపే యోసేపు చనిపోయి ఉంటాడని అర్థం చేసుకోవాలి. (యోహాను|19:25-27|యోహాను19:25–27), [4] యేసుకు బందువులు, సోదరులు మరియూ సోదరీమణులు ఉన్నారు.[5] గ్రీకులోadelphos అంటే సోదరుడు దగ్గరి బంధువు,రక్త సంబందికుడు..(see మరియ కన్యత్వం).
No comments:
Post a Comment