Saturday, 5 November 2016

అండమాన్‌ - నికోబార్‌ దీవులలో క్రైస్తవ్యపు తొలి అడుగులు

అండమాన్‌ - నికోబార్‌ దీవులలో క్రైస్తవ్యపు తొలి అడుగులు

కార్‌ నికోబార్‌ దీవులలో థాబ్దాల పూర్వం నాటబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ సువార్త తొలిబీజం మొలకెత్తి వేరుపారి వృక్షంగా ఎదిగి నేటికి దాని మూలాలు ఇతర ఆర్చిపెలాగో దీవులకు విస్తరించిన చారిత్రాత్మక నేపధ్యాన్ని "Sons of Light - the story of Car Nikobar" అను గ్రంధములో కీ.శే.బిషప్‌ యం.డి.శ్రీనివాసన్‌ తెలియజేసిన అనేక అంశాలు మనలో గొప్ప ప్రేరణను, నూతన ఉత్తేజాన్ని నింపడమేకాక పాపపు ఊబిలో చిక్కుకొని గాడాంధకారపు లోయలలో మగ్గుతున్న నేటి యావత్‌ మానవాళి విమోచనార్ధం ఆ సువార్త లోకానికి ప్రకటించవలసిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. నిద్రాణమైన నేటి క్రైస్తవ సంఘాన్ని తట్టిలేపుతుంది.

1789 సంవత్సరంలో బ్రిటీష్‌వారు దీవులను ఆక్రమించిన తొలి నాళ్ళలో కొంతమంది బ్రిటీష్‌ అధికారులతో పాటు బెంగాల్‌ నుండి తీసుకొని రాబడిన కొంతమంది ఖైదీలు/నేరస్తులు మాత్రమే ఇక్కడ (అండమాన్‌) లో కాపురముండేవారు. అన్ని కార్యక్రమాలలో పాస్టర్‌గారు ప్రధానపాత్ర పోషించేవారు. నేలపై వున్నపుడు గాని, ఓడ ప్రయాణంలో కాని దైవ కార్యాలు నిర్విఘ్నంగా జరిపించేవారు. 1844 సంవత్సరంలో బ్రిటన్‌ మరియు రన్నీమేడే అను రెండు భారీ ఓడలు భయంకరమైన సుడిగుండంలో చిక్కుకొని బ్రద్దలైపోయి అందు ప్రయాణిస్తున్న 600 మంది నావికులు, సైనికులు వారి కుటుంబాలు సుమారు రెండు నెలల కాలం ఒక నిర్జన దీవిలో చిక్కుకొనిపోయారు. అయినప్పటికీ ఆ రెండు నెలల కాలంలో కూడా ప్రతి ఆదివారం తప్పక ఆరాధన జరిపేవారు.




1863 నుండి 1923 వరకు అండమాన్‌ దీవులు వివిధ ప్రభుత్వ అధిపతుల ఆధీనంలో వుంటూ వుండేవి. తరువాతి కాలంలో 1942 వరకు క్రైస్తవ గురువుల నిర్వహణలో ఉండేవి. పోర్ట్‌ బ్లేయర్లోని క్రైస్ట్‌ చర్చిలో సేవలందించిన పీఠాధిపతుల జాబితానుCNI తయారు చేసింది. రెవరెండ్‌ వి.యం.కెంప్‌ జాబితాలోని చిట్టచివరి పీఠాధిపతి. జపాన్‌ వారు దీవులను ఆక్రమించిన తరువాత కెంప్‌ గారిని బంధించిరి. దైవ సేవకులే ప్రభుత్వాధిపతులైనప్పటికి స్థానిక ప్రజల, ఖైదీల ఆత్మీయ సంక్షేమాన్ని, అవసరాలను దృష్టిలో ఉంచుకొనెడివారు. రెవరెండ్‌ కోర్బిన్‌ నేటికీ గుర్తుంచుకోదగిన గొప్ప దైవజనులు. స్థానికులు నివసించే గృహాలు ఈయన ఆధీనంలోనే ఉండేవి. ఈయన గౌరవార్ధం పోర్టు బ్లెయర్‌లోని ప్రముఖ బీచ్‌కి కోర్బిన్స్‌ కేవ్‌ అని నామకరణం చేసారు.

20 వ శతాబ్దపు తొలి థకంలో, దీవులులోని క్రైస్తవ్యాన్ని గూర్చి FAM DASS తను రచించిన 'అండమాన్‌ ఐలాండ్స్‌' లో చక్కగా ప్రస్తావించాడు. ఈయన రికార్డుల ప్రకారం ప్రజలు మరియు అధికారులలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవారు. నేరస్తులలో క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉండేవారు. క్రైస్తవ జనాభాలో రోమన్‌ కాథలిక్కులు మరియు చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ సభ్యులు అధిక భాగంగా ఉండెడివారు. ఇతర క్రైస్తవ సంఘ శాఖలు కూడా ఉనికిలో ఉండేవి. రాస్‌ ద్వీపములోని క్రైస్ట్‌ చర్చ్‌ని ఆంగ్లికన్స్‌ ఆరాధన కొరకు వాడుకొనేవారు. నియామక దిన కూడికలు, ఆదివారపు ఆరాధనలు స్థానిక సేవకునిచే జరిపింపబడేవి.

దాస్‌ గారు చెప్పియున్న దాన్ని బట్టి కేథలిక్‌ సంఘ కాపరి స్థానికంగా నివాసం ఉండేవాడు కాదు. అవసరాన్ని బట్టి రంగూన్‌ మరియు ఇతర ప్రాంతాలనుండి సేవకుల్ని ఆహ్వానించి స్థానిక ప్రజల ఆత్మీయ అవసరాల్ని తీర్చెడివారు.

1920 థకం ప్రారంభంలో అడవులలో పని చేయుటకుగాను బ్రిటీష్‌వారు అధిక సంఖ్యలో కార్మికుల్ని దీవులకు తీసుకొని వచ్చేవారు. వారిలో అత్యధికులు కారేన్స్‌ (Karens) తెగకు చెందినవారు. వీరు 1925 సంవత్సరములో బర్మాలోని బేస్సిన్‌ (Bassien) ప్రాంతం నుండి తీసుకొనిరాబడిరి. వీరిని బ్రిటీష్‌ బాప్టిస్ట్‌ మిషనరీలు ఆదరించి సాగు చేయుటకు మధ్య అండమాన్‌ దీవులలోని భూములను మంజూరు చేసెడివారు. నేటికిని వీరు స్థానిక జనాభాలో భాగమై యుండి జీవన విధానాన్ని కొనసాగిస్తూనే వున్నారు. దీవులలో వీరు అతి పెద్ద క్రైస్తవ సమూహంగా అవతరించింది.

అదే కాలంలో ఒప్పంద కార్మికులుగా (contract labour) అడవులలో పని చేయుటకు చోటా నాగపూర్‌ ప్రాంతం నుండి అనేకమందిని దీవులకు తీసుకొని వచ్చారు. ఈ వలసలో రోమన్‌ కేథలిక్‌ సంఘం ప్రధాన భూమిక పోషించింది. స్థానిక సమాజంలో నేడు వీరు పెద్ద గుంపుగా ఆవిర్భవించిరి. వీరి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంలో కాథలిక్‌ సంఘమే బాధ్యత వహిస్తుంది.

1926 సంవత్సరంలో రక్షణ సైన్య సువార్త సేవకులు భట్టు తెగకు చెందిన వారిని అధిక సంఖ్యలో ఈ దీవులకు తీసుకొని వచ్చారు. వీరు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం యొక్క ఉత్తర ప్రాంతానికి చెందిన నేర ప్రవృత్తి కలిగిన తెగగా పేరు గాంచినవారు. వీరు ఆ రాష్ట్రంలో బందిపోటు దొంగలుగా జీవించెడివారు. రెవరెండ్‌ షియార్డ్‌ నాయకత్వంలోని రక్షణ సైన్యం యొక్క సంరక్షణలో ఈ తెగకు చెందిన అనేకులు క్రైస్తవ్యాన్ని హత్తుకొనిరి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ వారు ఈ దీవులను ఆక్రమించుకొని రక్షణ సైన్యానికి చెందిన బ్రిగేడియర్‌ ఫ్రాన్సిస్‌ను హతమార్చారు.

  స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ ప్రాయోజిత నివాస పధకాల కారణంగా అనేకులు ఈ దీవులకు వలస వచ్చారు. వారిలో ఈ ప్రాంత అభివృద్ధి నిమిత్తం వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేయుటకు అనేకులు ప్రభుత్వోద్యోగులుగా వచ్చిరి. కేరళ, తమిళనాడు మరియు ఆంధ్ర ప్రాంతాలకు చెందిన అనేకమంది క్రైస్తవులు ఈ ద్వీపాలలో స్థిరనివాసమేర్పరచుకొనిరి. జనాభా పెరిగిన కొలది సంఘాల సంఖ్య కూడా పెరిగింది. అయితే భాషా ప్రాతిపదికను మరియు శాఖా ప్రాతిపదికననుసరించి మాత్రమే ప్రజల అవసరాలు తీర్చుటలో సంఘాలు పరిమితమైనాయి. నేడు 30 కంటే ఎక్కువ క్రైస్తవ సంస్థలు మరియు సంఘాలు కలసి 26 కంటె ఎక్కువ భాషా సమూహాలకు అండమాన్‌ దీవుల వ్యాప్తంగా సేవ చేయుచున్నారు.


నికోబార్‌లో క్రైస్తవ్యం

అండమానీయులకంటే ముందుగానే నికోబారీయులు క్రైస్తవ ప్రభావానికి లోనయ్యారు.

12వ శతాబ్దంలోనే జేసుట్‌ బోధకులు నికోబార్‌ లో సువార్తీకరణను కాంక్షించిరి. కాని ప్రతికూల వాతావరణం, సౌకర్యాల కారణంగా అనేకులు మృతి చెందిరి. మరికొందరు స్థానికుల చేత సంహరింపబడిరి. అనేకులు ప్రతికూల వాతావరణానికి గురయ్యారు. 18వ శతాబ్దంలోనే మొరేవియన్‌ మిషనరీలు మరింత కృత నిశ్చయంతో సౌవార్తీకరణకు తెగించిరి. అయితే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 11 మంది దీవిలోను, 13 మంది ట్రాంక్విబార్‌కు తిరుగు ప్రయాణంలోను మృతి చెందిరి. వీరిలో సజీవుడుగా మిగిలిన చిట్టచివరి సహోదరుడు J.G.Hansel. ఇతడు సువార్తను విడచి దీవిని విడిచివెళ్లు సమయంలో పలికిన చివరి మాటలు ఏమనగా 'నాకు అప్పగింపబడిన బాధ్యతను నిర్వర్తించు క్రమంలో నా అంతరంగంలోని బాధను మాటలలో వ్యక్తీకరించలేను. అచ్చెరువుతో కన్నీరు విడచుట తప్ప నేను చేయగలిగినదేమీ లేదు.'

1807 సంవత్సరంలో రంగూన్‌కు చెందిన రోమన్‌ కాథలిక్‌ మిషనరీ దీవిలో సంఘ స్థాపనకు విఫలయత్నం చేసాడు. 1830-34 సంవత్సర కాలంలో ఒక క్రైస్తవ సముదాయాన్ని స్థాపించడానికి యత్నించి విఫలుడయ్యాడు.

ఘోరమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు, దట్టమైన అడవి, దీవులలోని చీకటి వాతావరణం, మూఢ నమ్మకాలు, ద్వీపవాసుల దయ్యాల ఆరాధనల ముందు మిషనరీల వీరచిత ప్రయత్నాలన్నీ తాత్కాలికంగా తలవంచక తప్పలేదు. నికోబారీయులు భూతవైద్యులు మరియు మాంత్రికుల ప్రాబల్యంలోనే వుండిపోయారు.

ఏమైనప్పటికీ చిట్టచివరి డానిష్‌ యాత్రికుని ప్రయత్నం అనంతరం 150 సంవత్సరముల తర్వాత నేటికి స్థానిక ద్వీపవాసులు ఎక్కువ శాతం క్రైస్తవులే. సంఘము యెడల వారికున్న భక్తికి దీవులకు వచ్చే యాత్రికులు సహితం ముగ్ధులయ్యేవారు. 1947లో ఈ దీవిని సందర్శించిన సర్‌ కాంప్టన్‌ మకెంజి మాటలు 'నా యొక్క కార్‌ నికోబార్‌ యాత్ర కాలంలో ఇక్కడ నేను చవిచూచిన మంచితనంలోని దైవశక్తిని నా జీవితములో మునుపెన్నడూ ఎరిగి యుండలేదు.' ఇంతటి అద్భుతమైన నెరవేర్పుకు 1895 సంవత్సరంలో నికోబార్‌ను సందర్శించిన తమిళ సువార్తికుడు వేదప్పన్‌ సోలోమోన్‌ మరియు జాన్‌ రిచర్డ్‌ సన్‌ ఇరువురూ కారకులు.

వేదప్పన్‌ గారు SPG మిషన్‌ ద్వారా నికోబార్‌ దీవులకు 1895 లో పంపబడ్డారు. అప్పటినుండి ఆయన మరణం 1909 వరకు నికోబారీల మధ్య భక్తితో సేవచేసియున్నాడు. ఆయన మరణానంతరం ఆయన భార్య అయిన సోలమన్‌ ఇక్కడ సేవను కొనసాగించి 1921లో ప్రభువు సన్నిధిని చేరినారు.

వేదప్పన్‌ సోలోమోన్‌ గారి ద్వారా ప్రభువునంగీకరించిన మొదటి వ్యక్తి రిచర్డ్‌ సన్‌. ఆ తరువాతి కాలంలో రిచర్డ్‌ సన్‌ గారు ఉపాధ్యాయ మరియు సువార్తికుడి శిక్షణ కొరకు బర్మాలోని మాన్డలేకి పంపబడిరి. 1912 లో బర్మా నుండి తిరిగి వచ్చి శ్రీమతి సోలోమన్‌ గారితో ఆమె ప్రభువు సన్నిధి చేరువరకు ఆమెకు సహచరుడిగా పనిచేసినారు. SPG   మిషన్‌ వారిచే పంపబడిన పండితుడైన సేవకుడు రెవ.జార్జ్‌ వైట్‌ హెడ్‌గారు బైబిల్‌ తర్జుమా చేయుటలో రిచర్డ్‌ సన్‌ గారికి సహకరించిరి. ఇరువురు కలిసి బైబిల్‌లోని నాలుగు సువార్తలు, అపోస్తలుల కార్యముల గ్రంధాన్ని తర్జుమా గావించిరి. జార్జ్‌ వైట్‌ హెడ్‌ మరణానంతరం రిచర్డ్‌ సన్‌ గారు క్రొత్త నిబంధన మిగిలిన భాగాన్ని నికోబారీల భాషలోనికి అనువదించిరి. ఈ మహత్కార్యము నికోబారీల మొత్తము తెగ క్రైస్తవ క్రైస్త్యము లోనికి నడిపింప బడడానికి ప్రధాన కారణమయింది.

1934 వ సంవత్సరంలో రిచర్డ్‌ సన్‌ గారు రంగూన్‌లో సేవకుడిగా అభిషేకించబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ దేశము ఈయనకు రెండు పర్యాయములు మరణ శిక్షను విధించింది. అయినాను ఆశ్చర్యకరంగా తప్పింపబడ్డారు. 1950 లో స్పెషల్‌ బిషప్‌గా నియమించబడిరి. తదుపరి పార్లమెంట్‌ సభ్యునిగా కూడా నియమితులయ్యారు.

అండమాన్స్‌ లో తెలుగు క్రైస్తవ్యపు కాంతి పుంజాలు

1858 లో అండమాన్స్‌లో కర్కశ కారాగార శిక్ష ప్రారంభించిన నాటినుండి తెలుగు వారు కూడా ఈ దీవిపై ఉనికిని కలిగి వున్నట్లు దాఖలాలున్నాయి. అయితే 1961 శ్రీ ఎం.జి.మెషేక్‌ రాసిన ఒక సంఘ రిజిస్టర్‌ని బట్టి తెలుగు క్రైస్తవ సంఘం గూర్చి కొంత సమాచారం తెలుస్తూంది. దీనిని బట్టి మెషేక్‌తో బాటు కె.ఎస్‌.రావ్‌, డి.సామ్యుల్‌ అనే మరో ఇద్దరు 1958 లో ఈ దీవికి వచ్చి క్రిస్మస్‌ దినాన ఆరాధన స్థలం గూర్చి వెతకడం జరిగింది. హెడ్డో లో ఒక మందిరాన్ని చూచి అక్కడ ద్వారా పాలకునిగానున్న వ్యక్తిని కలిసి ఆ మందిరంలో ఆరాధించుకోవచ్చానని అడిగాడు. వీరు తెలుగు మాట్లాడడం గమనించిన జి.సామ్యుల్‌ అనే సహోదరుడు వీరిని పాస్టర్‌ తంగరాజ్‌ వద్దకు తోడుకొని వెళ్ళాడు. పాస్టర్‌ తంగరాజ్‌ వారితో ఆప్యాయంగా అచ్చ తెలుగు భాషలో మాట్లాడి ఆరాధనకు ఆహ్వానించాడు. అతి త్వరలోనే ముగ్గురు తొమ్మండుగురుగా పెరిగారు. 1960 లో కొంతమంది క్రైస్తవేతరులు కూడా వీరితో కలిసి ఆరాధనలో పాల్గొనడం మొదలు పెట్టారు. వీరందరూ కలిసి ఆంధ్ర ప్రాంతం నుండి అనేకులు ఈ దీవులకు రావాలనీ, తెలుగు సంఘం ప్రారంభం కావాలనీ కన్నీళ్ళతో ప్రార్ధించారు.

అనూహ్యమైన రీతిలో పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి 150 మంది పనివారిని మెయిన్‌ లాండ్‌ నుండి తీసుకు రావలసిందిగా అండమాన్‌ ప్రభుత్వం మెషేక్‌ను కోరింది. మెషేక్‌ తెచ్చిన వారిలో కొందరు క్రైస్తవులు కూడా వున్నారు. వీరిని ప్రభుత్వం దిగ్లిపూర్‌, ఫెర్రర్‌ గుంజ్‌ హేవ్లాక్‌ ఐలాండ్‌ తదితర ప్రాంతాలకు పంపింది. ఈ పనివారిలో నున్న క్రైస్తవుల ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగు సంఘాలు స్థాపించబడ్డాయి.

1961లో సుమారు వంద మంది తెలుగు క్రైస్తవులతో 'ఆంధ్రా తెలుగు క్రిస్టియన్‌ మెథడిస్ట్‌ కాంగ్రిగేషన్‌ స్థాపించబడింది.

ఆది క్రైస్తవ మిషనరీల అవిరళ కృషి, త్యాగాల ఫలితంగా దీవులన్నిటిలో క్రైస్తవ్యం స్థిరపరచబడింది. ఒక శతాబ్దం కంటే తక్కువ కాల వ్యవధిలో అండమాన్‌ నికోబార్‌ దీవులలో క్రైస్తవ్యం అనూహ్యమైన విధంగా విస్తరించింది.


1906 నాటికి కేవలం 451 మందిగా నున్న క్రైస్తవులు 2001 నాటికి 77178 గా ఎలా తయారయ్యారు? దీనికి కారణం మిషనరీల నిస్వార్ధ సేవేనని చెప్పక తప్పక తప్పదు.

- డా||ఫ్రాన్సిస్‌ జేవియర్‌ నీలం

Thursday, 6 November 2014

The Way To Heaven Ministries

ఉదయంచిన నీతి సూర్యుడు


                   ప్రతి ఏటా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు యేసు ప్రభుని జన్మదినాన్ని ఓ పండుగగా.. ఓ మహోత్సవంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. వాస్తవానికి ఆయన డిసెంబర్ 25నే జన్మించాడనటానికీ చెప్పటానికీ తగిన ఆధారాలు లేవు. ప్రాచీన మధ్యప్రాచ్యంలో ప్రసిద్ధికెక్కిన కొన్ని మతాల వారు ఆ రోజును సూర్యుని జన్మదినంగా ఎంచి ఆరాధించటం ఆనవాయితీగా వస్తోంది. లోకాన్ని వెలుగుమయం చేస్తూ సకల జీవులకూ ప్రాణమిస్తూ పోషించే సూర్యుని పూజించేవారు. నేటికీ అరుణోదయ సూర్యుని వీక్షించి నమస్కారాలు చేయటం పరిపాటి. 
                  యేసుక్రీస్తు  జన్మించటానికి కొన్ని శతాబ్దాల మునుపే ప్రవక్తలు, భక్తులు ఆయనను నీతి సూర్యుడని ప్రస్తుతించారు. మలాకీ అనే భక్తుడు దేవుని నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయని ప్రవచించారు. అతనికి ముందు యెషయా అనే మరో దైవజనుడు ఆ నీతి సూర్యోదయం జరిగినప్పుడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారనీ.. ఆ వెలుగు మరణచ్ఛాయగల దేశ నివాసుల మీద ప్రకాశిస్తుందని తెలియజేశాడు. తమస్సు నుండి జ్యోతి లోనికి నడిపించే వాని కొరకు, అతని ఆగమనం కొరకు అనేక భక్తులు ఎదురుచూశారు. ప్రార్థించారు. ఆ ప్రార్థనల నిరీక్షలకు జవాబు జగత్ జ్యోతియైన యేసుని జననం. డిసెంబర్ 25న స్పష్టమైన సూర్యుని జన్మదినంగా భావించి పూజించిన రోజునే నీతి సూర్యుడైన యేసుని జన్మదినంగా ఎంచి ఆయనను పూజించటం ప్రారంభించారు. యేసు నీతి సూర్యుడు. లోకాన్ని ఆవరించిన చీకటిని పారద్రోలి లోకాన్ని వెలిగించేందుకు ఆయన వచ్చాడు. యేసు నోటి నుండి వెలువడిన సప్త మహా వాక్యాలను, అహమేవ (నేను నేనే) అనే పదంతో ప్రారంభమయ్యే వాక్యాలలో ఒకటి ‘అహమేవ జగత్యోజ్యోతి’ ‘నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక, జీవపు వెలుగు కలిగి ఉందురు. 
                            ఆయనతో మూడున్నర సంవత్సరాలు సహవసించి ఆయనను క్షుణ్ణంగా ఎరిగిన ఆయన శిష్యుడొకరు ఆయన జీవిత కథను గ్రంథస్థం చేస్తూ ఉపోద్ఘాతంలో ‘ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాని గ్రహింపలేదు. నిజమైన వెలుగు అయిన యేసు లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నాడు’ అని రాస్తాడు. 
                         యేసుక్రీస్తు నరావతార ఉద్దేశాలను గమనిస్తే, ఒకటి ప్రధానంగా కనపడుతుంది. పాపి విమోచన, దీన జనోద్ధరణ. ఆయనను నిందిస్తూ విరోధులు హేళనగా పాపులను చేర్చుకొని వారితో మిత్రత్వం చేస్తున్నాడని చెప్పినా అదే ఆయన నరావతార ఉద్దేశం. దుష్టుడు తన దౌష్ట్యాన్ని గుర్తించి ఆ జీవితానికి స్వస్థి పలికి నీతియుక్తమైన జీవితాన్ని జీవించటానికి అవసరమైన సహాయాన్ని, శక్తిని అనుగ్రహించుట ద్వారా వారిని విమోచిస్తాడు. ఆయన దుష్టులను, పాపులను విమోచించుటకే వచ్చాడు అనే సత్యాన్ని అనుభవించి తెలుసుకున్న పౌలు అనే వ్యక్తి చెప్పిన మాట ‘పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చెనను మాట నమ్మతగినది. పూర్ణాంగీకారమునకు తగినది’ - ఈ మాట అనుభవజ్ఞానం చెప్పిన గొప్ప మాట. ఒకప్పుడు హానికరుడు దోషకారుడు, హింసకుడైన తనను యేసు తన దివ్య దర్శనముతో ఏలాగు నూతన జీవితాన్ని ప్రసాదించాడో ఓ సాక్షిగా.. వ్రాతపూర్వకంగా తెలియజేశాడు. యేసుప్రభువే తన నరావతార ఉద్దేశాన్ని తెలుపుతూ ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకమునకు వచ్చితిని’ అని చెప్పాడు. ఇంకా ఆయన తన రాక ఉద్దేశాన్ని తెలుపుతూ తాను ఓ మంచి కాపరిననీ, గొర్రెలకు అనగా నరగొర్రెలకు సమృద్ధ జీవము యిచ్చుటకు వచ్చానని, ఆ సమృద్ధ జీవము తన బలియాగము ద్వారా కలుగుతుందని వివరణ ఇచ్చాడు. యేసు అవతరణ తత్త్వాన్ని లక్ష్యాన్ని తెలియజేసే ప్రకటన ఇది.
               నజరేతు అనే ఊరిలోగల ఓ ప్రార్థనా స్థలంలో బీదలకు శుభకరమైన వర్తమానమును ప్రకటించుటకు, చెరలోనున్నవారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపునిచ్చుటకు, నలిగిన వారిని విడిపించుటకు తన తండ్రియైన దేవుడు తనను అభిషేకించి పంపియున్నాడని తెలియజేశాడు. పేద దళిత జనోద్ధరణే తన నరావతార ఉద్దేశమని నిర్ద్వంద్వంగా ఆయన తెలియజేశాడు. తాను గర్భస్థ శిశువుగా వుండగానే ఆయన పుట్టుక దీనులకు బీదలకు ఎట్లు దీవెనకరంగా ఉంటుందో ఒక గేయ రూపంలో హృద్యంగా వివరించింది. ఆయన గర్వాంధులను చెదరగొట్టుతాడు. దీనులను ఉద్ధరిస్తాడు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి వారిని అందలమెక్కిస్తాడని కొనియాడింది. దీనులలో వుండే దివ్యత్వాన్ని వెలికితీసే ప్రయత్నం చేశాడాయన. దీనులైన వికలాంగుల పట్ల రోగుల పట్ల అన్నార్తుల పట్ల ఆయన చూపిన ఆదరణ అపూర్వమైంది. 
             మొదటి శతాబ్దంలో సమాజం వర్గ సమాజంగా చీలిపోయింది. సాంఘిక తారతమ్యాలు పాటించబడ్డాయి. ధనంతోపాటు యాజకత్వము, వేద పరిజ్ఞానము సాంఘిక విభేదాలకు దారి తీశాయి. వేద పరిజ్ఞానం లేనివారిని, ధనిక వర్గానికి చెందని బీదలను ‘్భమిపుత్ర’ అని పిలువబడి, హీనంగా చూడబడ్డారు. నరావతారిగా ఉన్నపుడు ఆయన ఈ భూమిపుత్ర లేక బహుజనులతో మమేకమయ్యాడు. అట్టివారిలో కొందరిని ఆయన తన శిష్యులుగా వుండటానికి పిలిచాడు. వెలివేయబడ్డ వారి ప్రక్కన నిలిచి వారిని ఉద్ధరించాడు. వారితో కలిసి తిరగటం, కలిసి భోజనం చేయడం, బోధించడం, స్వస్తి చేయటం నేరాలుగా ఆయన విమర్శకులు తలంచారు. అలా కలిసి తిరగటం ఆయన సమర్థించుకోవటమే కాక దళిత దీన జనోద్ధరణ పథకంలో తనతో పాలిభాగస్తులలు కావాలని తన విమర్శకులను ఆహ్వానించాడు. 
                 మరియ కుమారుడు బీదలను, దీనులను దోచుకొనే దోపిడీ వర్గానికి ఓ సవాలు. ప్రతి క్రిస్మస్ విమోచనా ఆధ్యాత్మిక, పోరాడే ఆధ్యాత్మికతను అలవరచుకోమని సకల మానవాళిని సవాలు చేస్తోంది. 
                    శాంతాక్లాజ్: క్రీ.శ.4వ శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే బిషప్ ఉండేవాడు. ఇతడు ఆసియా మైనర్‌లోని మైరా అనే ప్రాంతవాసి. ఇది నేటి టర్కీలోని ప్రాంతం. నికోలస్ అత్యంత ధనవంతుడు. ఐతే - అతడు ఏ మాత్రం గర్వంకానీ.. అధికార దర్పం గానీ ప్రదర్శించేవాడు కాదు. సాటి మనిషిని తనకంటే మిన్నగా ప్రేమించేవాడు. దయ, కరుణ అతడికి పెట్టని ఆభరణాలు. పేదలకు ఆశ్రయాన్ని కల్పించేవాడు. కరుణ చూపేవాడు. వారిని ఆపదలో ఆదుకోవటమే కాదు - శాశ్వత జీవన భృతిని కల్పించేవాడు. యేసుక్రీస్తు జన్మదినాన పిల్లలకూ వృద్ధులకూ గిఫ్ట్‌లను అందజేసేవాడు. క్రిస్మస్ తాత తమకు బోలెడన్ని బహుమతులను ఇచ్చాడని పిల్లలు చెప్పుకొనేవారు. ఐతే - నికోలస్ క్రిస్మస్ తాతకు ప్రత్యేకించి ఓ రూపం లేదు. ఇది జరిగిన చాన్నాళ్లకు అంటే 1931లో సాఫ్ట్‌డ్రింక్ కోకాకోలా సంస్థ శీతాకాలంలో తమ ప్రొడక్ట్‌ని మార్కెట్ చేసేందుకు స్వీడిష్ ఆర్టిస్ట్ హేడన్ సన్‌బ్లామ్‌తో స్కెచ్ వేయించారు. బాన కడుపు.. చిరునవ్వుల ముఖారవిందం మాటున వొతె్తైన తెల్లటి గడ్డం.. రెడ్ సూట్‌లో వింతగొలుపుతూ మొట్టమొదటి ‘శాంటాక్లాజ్’ రూపం ప్రజల్లోకి వచ్చింది. అది మొదలు నికోలస్ ‘శాంతాక్లాజ్’గా వస్తూంటాడన్న ప్రచారం జరిగింది. 
                      క్రిస్మస్ ట్రీ: ఇంగ్లండ్‌లో క్రైస్తవ్యం వేళ్లూనుకుంటున్న రోజులు. విల్‌ఫ్రెడ్ అనే ఫాదర్ ఓ రోజు ప్రార్థన చేస్తూండగా పక్కనే ఉన్న ‘ఓక్’ చెట్టు వొరిగింది. ‘ఓక్’ చెట్టుని ఆ తెగ వారు ఆరాధనలో భాగంగా భావిస్తారు. ఇలా జరగటం శుభ సూచకమనీ.. చెట్టు కాండం అంతంలేని జీవితానికి సంకేతం.. పచ్చని ఆకులు నిత్య జీవానికి మార్గం.. కాబట్టి ఈ చెట్టుతో ‘క్రిస్మస్ ట్రీ’ని భావిద్దామని అన్నాడాయన. దాంతో ఆ చెట్టు కొమ్మలకు రకరకాల బహుమతులను వేలాడదీయటం... అలంకరించటం చేస్తూ వచ్చారు. క్రిస్మస్ ట్రీని కొవ్వొత్తులతో అలంకరించి వాటిని వెలిగించిన మొదటి వ్యక్తి మార్టిన్ లూథర్ అని ఒక మాట ప్రచారంలో ఉంది. జర్మనీ వాసులు క్రిస్మస్ ట్రీని బాతు ఈకలతో చేయటం ఆనవాయితీ. క్రీ.శ.16వ శతాబ్దంలో జర్మన్లు క్రిస్మస్ ట్రీని మొట్టమొదటిగా ప్రారంభించినట్టు చరిత్ర కథనం. 
                           క్రిస్మస్ కలర్స్: క్రిస్మస్ వేడుకల్లో తరచూ ఎరుపు, పచ్చ, బంగారు వర్ణాలు కనిపిస్తాయి. ఎరుపు - క్రీస్తు రక్తానికి సంకేతం. పచ్చ - జీవానికి గుర్తు. బంగారు - ప్రకాశతకు, వెలుగుకు ముఖ్యంగా క్రీస్తు రాజరికానికి గుర్తుగా పేర్కొంటారు. 
                        జింగిల్ బెల్స్: అమెరికన్లు క్రిస్మస్ సందర్భంగా పాడే పాటల్లో ఇదొకటి. జేమ్స్ లార్డ్ ప్రియర్ పాంట్ (1822 - 1893) ఈ పాటని రాశాడు. 1850లో రాసిన ఈ పాటను బోస్టన్ సండే స్కూల్ పిల్లలు మొట్టమొదటిసారిగా పాడారు. అప్పట్నుంచీ ‘్థంక్స్ గివింగ్’ పాటగా ఇది ప్రాచుర్యం పొందింది. ‘జింగిల్ బెల్స్’ అనేవి గుర్రం మెడలోని గంటలు. క్రిస్మస్ సమయం: * క్రిస్మస్ సమయం ఎదురుచూసే సమయం * క్రిస్మస్ కాలం స్వస్థతా కాలం * క్రిస్మస్ కాలం ఓపిక చూపే సమయం * క్రిస్మస్ కాలం దాతృత్వ సమయం * క్రిస్మస్ కాలం గ్రహింపు కాలం * క్రిస్మస్ సమయం పిల్లల సమయం * క్రిస్మస్ కాలం నేర్చుకొనే కాలం * క్రిస్మస్ సమయం ప్రేమించే సమయం * క్రిస్మస్ సమయం జ్ఞాపకం చేసుకొనే సమయం. క్రిస్మస్ శాంతి ప్రార్థన:

ప్రభూ! నీ శాంతి సాధనంగా నన్ను వాడుకో
ఎక్కడ ద్వేషమో అక్కడ ప్రేమను/ ఎక్కడ గాయమో అక్కడ క్షమను
ఎక్కడ అనుమానమో అక్కడ విశ్వాసాన్ని
ఎక్కడ నిరాశో అక్కడ నిరీక్షణను/ చీకటి ఉన్నచోట వెలుగును
దుఃఖమున్న చోట ఆనందాన్ని/ నన్ను నాటనిమ్ము!
పరమ గురువైన ఓ ప్రభూ!/ నేను ఆదరించాలని కోరబడక
ఆదరించేలా ఇతరులు నన్ను గ్రహించాలని కోరుకునే దానికంటే
ఇతరులను గ్రహించటాన్ని నాకు నేర్పించు!/ ప్రేమించబడాలని కోరుకొనక
ప్రేమించటానికి నన్ను అపేక్షింపనిమ్ము!/ ఎందుకనగా-
ఇవ్వటం వలన తిరిగి మాకు దొరుకుతుంది/ క్షమించటం వలన క్షమ నొందుతాము
చనిపోవటం ద్వారా తిరిగి నిత్య జీవము కొరకై లేస్తాము.



--------------------------------------------------------------------------------------------------------------------------------
యేసు రోగులను స్వస్థపరచడం

యేసు దేశమంతటా ప్రయాణిస్తున్నప్పుడు రోగులను స్వస్థపరిచేవాడు. ఆయన చేసిన అద్భుతాల గురించిచుట్టుప్రక్కల గ్రామాల్లోని పట్టణాల్లోని ప్రజలకు తెలిసిపోయేది. కాబట్టి ప్రజలు అంగవిహీనులను, గ్రుడ్డివాళ్ళను, చెవిటివాళ్ళను, ఇతర వ్యాధులతో బాధపడేవారిని చాలామందిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చేవారు. యేసు వాళ్ళందరినీ స్వస్థపరిచేవాడు.
యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చి అప్పటికి మూడు సంవత్సరాలకంటే ఎక్కువకాలం గడిచింది. యేసు తాను
త్వరలోనే యెరూషలేముకు వెళతానని, అక్కడ తాను చంపబడతానని, ఆ తర్వాత మృతులలోనుండి తిరిగి
లేపబడతానని తన అపొస్తలులకు చెప్పాడు. అలా జరిగేంతవరకూ యేసు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూనే
ఉన్నాడు.
ఒకరోజు యేసు సబ్బాతు దినాన బోధిస్తున్నాడు. సబ్బాతు యూదులకు విశ్రాంతి దినం. చిత్రంలో మీకు కనిపిస్తున్న ఆ స్త్రీ వ్యాధిగ్రస్తురాలు. ఆమె 18 సంవత్సరాలుగా అలా వంగిపోయి ఉంది, ఆమె సరిగ్గా నిలబడలేకపోయేది. యేసు ఆమెపై తన చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమె స్వస్థతపొందింది!
అది చూసి మతనాయకులకు చాలా కోపం వచ్చింది. వారిలో ఒకడు ‘మనం పని చేయడానికి ఆరు రోజులు ఉన్నాయి. స్వస్థపరచబడడానికి రావలసింది ఆ రోజుల్లోనే కానీ విశ్రాంతి దినాన కాదు!’ అని అరిచాడు.
అందుకు యేసు, ‘చెడ్డ మనుష్యులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినాన తన గాడిదను విప్పి తోలుకొని వెళ్ళి దానికి నీళ్ళు పెడతాడు. పద్దెనిమిది సంవత్సరాలనుండి వ్యాధితో బాధపడుతున్న ఈ స్త్రీ విశ్రాంతి దినాన స్వస్థపరచబడకూడదా?’ అన్నాడు. యేసు అన్న మాటలకు ఆ చెడ్డ మనుష్యులు అవమానంతో తలవంచుకున్నారు.
తర్వాత యేసు, ఆయన అపొస్తలులు యెరూషలేము వైపుకు ప్రయాణమై వెళ్ళారు. వాళ్ళు యెరికో పట్టణం వెలుపలికి చేరుకోగానే ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిలో వెళ్తున్నాడన్న సంగతి విని, ‘యేసూ మాకు సహాయం చెయ్యి!’ అని కేకలు వేశారు.
యేసు ఆ గ్రుడ్డివాళ్ళను తన దగ్గరకు పిలిచి ‘నేను మీకు ఏమి చెయ్యాలి?’ అని అడిగాడు. అందుకు వాళ్ళు ‘ప్రభువా, మా కళ్ళు తెరిపించు’ అన్నారు. యేసు వాళ్ళ కళ్ళను ముట్టుకున్నప్పుడు వెంటనే వాళ్ళు చూడగలిగారు! యేసు ఇలాంటి ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఎందుకు చేసేవాడో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన ప్రజలను ప్రేమించాడు, వాళ్ళు తనపై విశ్వాసముంచాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన రాజుగా
పరిపాలించేటప్పుడు భూమ్మీద ఎవ్వరూ వ్యాధులతో అని మనం నమ్మకంతో ఉండవచ్చు